మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘నాయక్’ సినిమా ఆడియో రిలీజ్ వాయిదా పడిందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అనుకున్న దాని ప్రకారం ఈ సినిమా ఆడియో డిసెంబర్ 14న విడుదల కావాల్సి ఉంది. రామ్ చరణ్ ఆర్గనైజర్స్ ని తన అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలుగకూడదని పెద్ద వేదికని చూడమని చెప్పారు. ఈ విషయాన్ని తమన్ ట్విట్టర్లో ఖరారు చేసాడు. ‘ ‘నాయక్’ ఆడియో వేదిక ఖరారు కాకపోవడంతో రిలీజ్ డేట్ పై ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. రాత్రి లోపు ఖచ్చితమైన విషయం తెలిసే అవకాశం ఉందని’ తమన్ ట్వీట్ చేసాడు.
రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, అమలా పాల్ తదితరులపై క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వి.వి వినాయక్ డైరెక్షన్లో డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.