మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘నాయక్’ సంక్రాంతి బరిలోనే ఉంది. షూటింగ్ ఆలస్యమవడం వల్ల సంక్రాంతి సమయానికి రాకపోవచ్చు అనే పుకార్లు నడుస్తున్న నేపధ్యంలో చిత్ర బృందం సంక్రాంతి సమయానికి ఎట్టి పరిస్తుతుల్లోను సినిమాని విడుదల చేస్తామని అన్నారు. చిత్ర షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. చరణ్ గత రెండు రోజుల కంటిన్యూగా డబ్బింగ్ చెబుతుండగా డైరెక్టర్ వివి వినాయక్, నిర్మాత డివివి దానయ్య పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో పోటీకి సిద్ధమవుతున్న నాయక్ జనవరి 9న విడుదల చేస్తామని ప్రకటించారు. చరణ్ సరసన కాజల్, అమల పాల్ నటించారు.