మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాస్ ఎంటర్టైనర్ ‘నాయక్’ సినిమా ఈ రోజు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ వారు ఈ సినిమాకి ‘ఎ ‘ సర్టిఫికేట్ ఇచ్చారు. ప్రొడక్షన్ టీం ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ కోసం ట్రై చేసారు కానీ బోర్డ్ మాత్రం ఎ సర్టిఫికేట్ ని ఓకే చేసింది. ఈ సినిమాలో ఫుల్ యాక్షన్, గ్లామర్ తో పాటు మాస్ డైలాగ్స్ కూడా ఉండనున్నాయి.
వి.వి వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ కంపోస్ చేసాడు. రామ్ చరణ్ లీడర్ గా కనిపించనున్న ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను కోల్ కతాలో చిత్రీకరించారు. డి.వి.వి దానయ్య నిర్మించిన ఈ సినిమాని జనవరి 9న రిలీజ్ కానుంది.