ఎట్టకేలకు నాయక్ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు

ఎట్టకేలకు నాయక్ ఆడియో రిలీజ్ డేట్ ఖరారు

Published on Dec 13, 2012 10:00 AM IST

Nayak

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘నాయక్’ సినిమా కార్యక్రమం పలు సార్లు వాయిదా పడి చివరికి వచ్చే సోమవారం అనగా డిసెంబర్ 17న హైదరాబాద్లో జరగనుంది. ఈ తేదీని ఇప్పుడే ఖరారు చేసారు, అలాగే రెండు ఆడియో టీజర్స్ ని కూడా రిలీజ్ చేసారు. ఆడియో వేదిక విషయంలో ఈ చిత్ర ప్రొడక్షన్ టీం ఇంకా ఖచ్చితమైన సమాచారాన్ని తెలియజేయలేదు. నాయక్ లో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ – అమలా పాల్ ఆడిపాడుతున్నారు.

ఇండస్ట్రీ వర్గాలు ఈ సినిమాలో గ్లామర్ కాస్త ఎక్కువగానే ఉంటుంది అని అంటున్నారు, ఇటీవలే విడుదల చేసిన ఈ మూవీ పోస్టర్లని చూస్తే అది నిజమే అనిపిస్తుంది. మాస్ డైరెక్టర్ వి.వి వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 9న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

తాజా వార్తలు