నాయక్ ఆడియో తేదీ, వేదిక ఖరారు

నాయక్ ఆడియో తేదీ, వేదిక ఖరారు

Published on Dec 10, 2012 1:10 PM IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘నాయక్’ సినిమా ఆడియో డిసెంబర్ 16న నానక్రాంగూడాలోని రామానాయుడు స్టూడియోస్ లో జరగనుంది. గత కొన్నిరోజులుగా అక్కడ ఇక్కడ అంటూ వస్తున్న వార్తలకి సమాధానంగా ఖచ్చితమైన తేదీని, వేడుకని ప్రొడక్షన్ టీం ఖరారు చేసింది. ఎస్.ఎస్ తమన్ సంగీతం అందించిన ఈ ఆల్బంలో మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ రీమేక్ ‘సుభలేక రాసుకున్నా’ పాటని రీమిక్స్ పాట కూడా ఉంది.

కాజల్ అగర్వాల్, అమలా పాల్ జంటగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాని వి.వి వినాయక్ డైరెక్ట్ చేస్తున్నాడు. డి.వి.వి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ పక్కా యాక్షన్ హీరో అవతారంలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఫుల్ యాక్షన్, పొలిటికల్ ఎలిమెంట్స్ ఉంటాయని అందరూ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమాని మెగా అభిమానులకు సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నారు.

తాజా వార్తలు