ప్రస్తుతం ప్రభాస్ దర్శకుడు రాధా కృష్ణ తో పీరియాడిక్ లవ్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముగిసిన తరువాత ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకానుంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా సెన్సిబుల్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా రానుంది. కాగా ప్రభాస్ తన తదుపరి చిత్రంగా మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ తో భారీ పాన్ ఇండియా చిత్రం ప్రకటించడం జరిగింది.
సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ నిర్మాణంలో ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఓ సైన్స్ ఫిక్షన్ మూవీగా భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేస్తున్న నాగ్ అశ్విన్ క్యాస్టింగ్ కూడా భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ నుండి హీరోయిన్ తో పాటు కీలక పాత్రల కోసం నటులను తీసుకోనున్నారట. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ 500 కోట్ల బడ్జెట్ పై మాటే అని తెలుస్తుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ రంగంలోకి దింపనున్నారట. ఈ మూవీ బడ్జెట్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కి మించి ఉంటుందని సమాచారం.