‘హరిహర వీరమల్లు’ ప్రీమియర్ నైజాం షేర్ వసూళ్లు ఇవే..!

HHVM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘హరిహర వీరమల్లు’ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో సందడి చేస్తోంది. ఈ సినిమాను క్రిష్, జ్యోతికృష్ణ డైరెక్ట్ చేయగా పూర్తి హిస్టారికల్ ఎపిక్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వారు తాజాగా ఈ చిత్ర సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.

ఈ సెలబ్రేషన్స్ వేడుకలో ఈ చిత్ర నైజాం డిస్ట్రిబ్యూర్స్‌లో ఒకరైన మైత్రీ రవి మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఈ రేంజ్‌లో రెస్పాన్స్ వస్తుందని తాము ముందుగానే ఊహించామని తెలిపారు. ఈ చిత్రం ప్రీమియర్స్ రూపంలో కేవలం నైజాంలోనే రూ.3.36 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టిందని.. ఇక ఓపెనింగ్ వసూళ్లు రికార్డు స్థాయిలో ఉంటాయని తాము భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

వీరమల్లు చిత్రానికి బాక్సాఫీస్ దగ్గర మిశ్రమ స్పందన లభిస్తున్నా, బుకింగ్స్ చూస్తుంటే ఈ సినిమా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని సినీ సర్కిల్స్ అంటున్నాయి. ఇక ఈ సినిమాలో నిధి అగర్వల్ హీరోయిన్‌గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్రలో నటించాడు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందించిన ఈ సినిమాను ఏ.ఎం.రత్నం ప్రొడ్యూస్ చేశారు.

Exit mobile version