‘ఎన్టీఆర్ సినిమా’ వేరే స్థాయిలో ఉంటుందట !

‘ఎన్టీఆర్ సినిమా’ వేరే స్థాయిలో ఉంటుందట !

Published on Sep 29, 2025 10:00 AM IST

JrNTR-Neel

రిషబ్‌ శెట్టి హీరోగా రాబోతున్న సినిమా ‘కాంతార చాప్టర్‌ 1’. ఈ సినిమా విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్‌ ముఖ్య అతిధిగా వచ్చారు. ఇక ఈ వేడుకలో నిర్మాత వై.రవిశంకర్‌ మాట్లాడుతూ.. ‘కాంతార చాప్టర్‌ 1’ సినిమా చూసిన ముగ్గురు నలుగురు అద్భుతంగా ఉందని చెప్పారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా గొప్ప ఆదరణని పొందుతుందని ఆశిస్తున్నా. ఇక రుక్మిణీ వసంత్‌ మా సినిమాలో ఎన్టీఆర్‌ సరసన నటించబోతుంది. ఆమె అద్భుతమైన నటి’ అని వై.రవిశంకర్‌ తెలిపారు.

ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ సినిమా గురించి నిర్మాత వై.రవిశంకర్‌ మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్‌ – ప్రశాంత్‌ నీల్‌ కలయికలో మేం చేస్తున్న సినిమా కొత్త షెడ్యూల్‌ని వచ్చే నెలలో మొదలు పెట్టబోతున్నాం. మేం ప్రామిస్‌ చేసినట్టుగా అనుకున్న సమయానికే సినిమాని తీసుకొస్తాం. ఆ సినిమా కచ్చితంగా వేరే స్థాయిలో ఉంటుంది’’ అని ఆయన అన్నారు. అన్నట్టు ఈ సినిమా కోసం ఎన్టీఆర్ కొత్త గెటప్ ట్రై చేస్తున్నారు. ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్‌’ అని ప్రచారంలో ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు.

తాజా వార్తలు