ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హైదరాబాద్లో ‘కాంతార చాప్టర్ 1’ విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన సినిమా ఇది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ‘కాంతార’కి ముందు భాగం కథతో రూపొందిన ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ వేడుకలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్ నాకు సోదరుడు, స్నేహితుడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఓ సోదరుడితో మాట్లాడినట్టే అనిపిస్తోంది’ అని రిషబ్ శెట్టి చెప్పుకొచ్చారు.
రిషబ్ శెట్టి ఇంకా మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ ఈ వేడుకకి రావడం ఆనందంగా ఉంది. ‘కాంతార చాప్టర్ 1’కి సహకారం అందించమని నేను చెప్పను, తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని నాకు తెలుసు’ అని రిషబ్ శెట్టి తెలిపారు. హీరోయిన్ రుక్మిణీ వసంత్ మాట్లాడుతూ ‘‘ఈ వేడుకకి వచ్చినందుకు ఎన్టీఆర్కి కృతజ్ఞతలు. తన సొంత సినిమాలా భావించి, తొలి రోజు నుంచీ మా బృందాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాని చూసి అందరూ ఆస్వాదించాలని ఆమె కోరారు. ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.