మెగా ఫ్యామిలీ నుండి త్వరలో ఇంకో హీరో ఎంట్రీ ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అతనే సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ తేజ్. సుకుమార్ వద్ద దర్శకత్వ విభాగంలో పనిచేసిన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వైష్ణవ్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఉప్పెన అనేది టైటిల్. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం సుమారు రూ.20 కోట్ల బడ్జెట్ పెడుతున్నారట మైత్రీ నిర్మాతలు.
వైష్ణవ్ తేజ్ వెనుక మెగా ఫ్యామిలీ నేపథ్యం ఉన్నా ఆయనో డెబ్యూ హీరో. అతని మార్కెట్ రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రిడిక్ట్ చేయడం కష్టం. అలాంటిది ఆయన మీద మైత్రీ అంత పెద్ద మొత్తం వెచ్చించటం అంటే సాహసమనే అనాలి. మరి ఈ సాహసం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఇందులో ప్రతినాయకుడి పాత్రలో ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు.