టాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించి, ప్రస్తుతం పలు క్రేజీ చిత్రాలను లైన్‌లో పెట్టిన నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ గురించి అందరికీ తెలిసిందే. ఈ బ్యానర్ నుంచి ఓ సినిమా వస్తుందంటే అందులో కచ్చితంగా కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు ఫిక్స్ అవుతారు. ఇక ఈ బ్యానర్ తాజాగా క్రికెట్‌లోకి అడుగుపెట్టింది.
ఆంధ్ర ప్రదేశ్‌లో జరిగే ఆంధ్ర ప్రీమియర్ లీగ్(APL) టోర్నమెంట్‌కు మంచి క్రేజ్ ఉంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ACA) ఆధ్వర్యంలో జరిగే ఈ ట్వంటీ20 టోర్నీలో కొత్త ఆటగాళ్లు తమ ప్రతిభ చూపెట్టేందుకు మంచి అవకాశం లభిస్తుంది. ఇక ఈ టోర్నీలో సత్తా చాటిన వారు ఐపీఎల్, ఇండియన్ క్రికెట్ జట్టులో కూడా చోటు సంపాదించవచ్చు. అయితే, ఈసారి జరగబోయే ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌లో కొత్త జట్టుగా విజయవాడ సన్‌షైనర్స్ టీమ్‌ను సన్ ఇంటర్నేషనల్ సంస్థతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు.
ఇక ఈసారి జరగబోయే APL 4వ సీజన్ 2025 ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం 19 మ్యాచ్‌లు ఆడుతారు. మరి విజయవాడ సన్‌షైనర్స్ ఎలాంటి ఆరంభాన్ని ఇస్తుందో చూడాలి.