అలా చేస్తే ప్రేక్షకులని ఎవరు ఎంటర్టైన్ చేస్తారు : తమన్నా

అలా చేస్తే ప్రేక్షకులని ఎవరు ఎంటర్టైన్ చేస్తారు : తమన్నా

Published on Oct 31, 2012 6:24 PM IST


మన హీరోయిన్స్ మొదట తమ అందం మరియు ఆకృతితో ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఆ తర్వాత నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు చేయాలని అనుకుంటారు. బహుశా వారు గ్లామరస్ తారలుగానే గాక కూడా తమని నటిగా కూడా నిరూపించుకోవాలనుకుంటారు.

మన అందాల భామ మిల్క్ బ్యూటీ తమన్నా మాత్రం ఈ ట్రెండ్ కి విరుద్దంగా మాట్లాడుతోంది. తమన్నా ప్రస్తుతం సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. తనకి అప్పుడే నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించాలని అనే ఆలోచన లేదంటోంది. ‘ నాకు పూర్తిగా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలు మాత్రమే చేయాలని లేదు. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే సినిమాకి వచ్చిన ప్రేక్షకులని ఎంటర్టైన్ చేయడం చాలా ముఖ్యం. ప్రేక్షకులు తమ డబ్బు పెట్టి సినిమా చూడటానికి వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ ఆశిస్తారు. నాకు నచ్చిన పాత్రలు చేస్తే, సినిమాకి వచ్చిన ప్రేక్షకుల పరిస్థితి ఏమవుతుంది?’ అని తమన్నా అన్నారు. చాలా తెలివిగా సమాధానం ఇచ్చిన తమన్నా, ‘100% లవ్’ మరియు ‘ఊసరవెల్లి’ లాంటి సినిమాల్లో నటించినంతవరకూ మాకెలాంటి ఇబ్బంది లేదు.

తాజా వార్తలు