క్రికెట్ పై నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు !

క్రికెట్ పై నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు !

Published on Jul 27, 2020 11:37 AM IST

టాలీవుడ్ లో ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు ‘తమన్’. స్టార్ హీరోల సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ అందిస్తూ.. ముఖ్యంగా ‘అల వైకుంఠపురంలో’ సంగీతంతో తెలుగు సంగీత ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తమన్ కి
క్రికెట్ అన్నా కూడా బాగా ఇష్టమట. అయితే కరోనా దెబ్బకు క్రికెట్ మ్యాచ్ లను కూడా రద్దు చెయ్యక తప్పలేదు. దాంతో క్రికెట్ ప్రేమికులలు కిక్రెట్ మజా ఎప్పుడెప్పుడా అని వేచి చూస్తున్నారు.

ఇక తమన్ కూడా క్రికెట్ పై తనకున్న ప్రేమ గురించి తెలియజేస్తూ.. ‘నా స్పోర్ట్స్ రూమ్ శుభ్రపరచాను. ఈ అందమైన క్రికెట్ బ్యాట్స్ తో నా క్లినింగ్ ముగిసింది. క్రికెట్.. ప్లీజ్ త్వరగా తిరిగి వచ్చేయ్. ఎందుకంటే ఈ ఆట పై నా ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అభిరుచి మేధావి పుట్టుకలోని లక్షణం” అంటూ తమన్ ట్వీట్ చేశాడు. తమన్ ప్రస్తుతం మహేష్, బాలయ్య సినిమాలతో పాటు మరి కొన్ని సినిమాలకు సంగీతం సమకూరుస్తున్నారు.

తాజా వార్తలు