వయస్సుతో సంభందం లేని గ్లామర్ నాది : త్రిష

వయస్సుతో సంభందం లేని గ్లామర్ నాది : త్రిష

Published on Jul 8, 2012 10:09 AM IST


సౌత్ ఇండియన్ అందాల భామ త్రిష తన గ్లామర్ వయస్సుతో సంభందం లేకుండా ఇప్పటికే అలానే ఉందని మరియు తన అందాన్ని సంరక్షించుకోవడానికి చాల జాగ్రత్తలు తీసుకుంటానని అంటోంది. ” ఇన్ని సంవత్సరాలుగా నటిస్తున్న తన అందం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉందన్నారు. తన శరీర ఆకృతి కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటాను మరియు నా పని పట్ల తనకున్న పట్టుదల కూడా ఏ మాత్రం తగ్గలేదని అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ పట్టుదలతో పని చేస్తున్నానన్నారు. ఇన్ని సంవత్సరాల సినీ కెరీర్లో చాలా సినిమాలు చేశాను, దానికి గ్లామర్ ఒక్కటే సరిపోదు, ఎప్పుడైతే మంచి పాత్రలు ఎంచుకుంటామో అప్పుడే ప్రేక్షకులకు దగ్గరవుతామని మరియు ఇన్ని రోజులు తను సినీ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరోయిన్ గా వెలుగొందడానికి వెనుక దాగివున్న రహస్యం అదే అని త్రిష అన్నారు”. త్రిష ప్రస్తుతం తమిళంలో కొన్ని సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

తాజా వార్తలు