మహిళాప్రాధాన్యమైన పాత్రల విషయానికొస్తే అనుష్క తరువాత ప్రియమణి దర్శకుల ఎంపికగా మారింది. ఆమె చేసిన లేడీ ఓరియంటెడ్ సినిమాలే దానికి ఉదాహరణ. మరోసారి మహిళా ప్రాధాన్యమైన పాత్ర వున్న ‘చండి’ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఆడియో ఇటీవలే విడుదలైంది.
తాన గురించి మనకు తెలియని విషయాలను చెప్పమని ఒక పత్రిక కోరగా “నా మొదటి సంపాదన కేవలం 500 రూపాయిలే. నేను దాన్ని ఇప్పటికీ జాగ్రత్తగా దాచుకున్నా” అని అంది. ఆమెకు సినిమాలో ఒక పాట పాడాలని కోరికట. త్వరలో ఆ కోరిక తీర్చుకుంటాను అని తెలిపింది. మేక్ అప్ లేకుండా ఒక సినిమా చెయ్యాలని కోరిక కోరికగానే ఉండిపోతుందట.
తనకు రాబోయే వాడి గురించి అడగగా “ఆటను ధైర్యంగా మాట్లాడాలి. ఎటువంటి పరిస్థితినన్నా ధైర్యంగా ఎదుర్కోవాలి” అని చెప్పింది. ఆమె కోరికలకు తగిన వరుడు వస్తాడేమో చూద్దాం