సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యువ హీరోల్లో మంచు మనోజ్ ముందు వరుసలో ఉంటారు. సామాజిక అంశాలతో పాటు బంధాలు అనుబంధాల పై కూడా ఆయన ఎప్పటికప్పుడు తనదైన శైలిలో స్పందిస్తుంటారు. అయితే నేడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టినరోజు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా మనోజ్ కూడా కింద ఫోటో ను షేర్ చేస్తూ.. ‘మై డాడీ మై హీరో’ అంటూ తన తండ్రికి పుట్టినరోజు శుభకాంక్షలు తెలిపారు. ఫొటో చూస్తుంటే అల్లుడుగారు సినిమా టైంలో దిగిన ఫోటోలా ఉంది. సాంగ్ కోసం హిల్స్ లొకేషన్ కి వెళ్లిన సందర్భంలో మోహన్ బాబు చిన్నప్పటి మనోజ్ ను ఎత్తకుని దిగిన ఈ ఫోటో వారి మధ్య ప్రేమను ఆప్యాయతను బాగా తెలియజేస్తోంది.
ప్రస్తుతం మంచు మనోజ్ చాల గ్యాప్ తరువాత ఎట్టకేలకు మళ్లీ ‘అహం బ్రహ్మాస్మి’తో సినిమాల్లో యాక్టివ్ కాయబోతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేసే మనోజ్.. ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. మరి ఈ సినిమాతో మనోజ్ మళ్ళీ ఫామ్ లోకి రావాలని ఆశిద్దాం.
https://www.instagram.com/p/B951RoKJabE/