రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘మటన్ సూప్’ చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను అలుక్కా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు(BVC) బ్యానర్స్‌పై రామకృష్ణ వట్టికూటి సమర్పణలో రామచంద్ర వట్టికూటి దర్శకత్వం వహించగా మల్లిఖార్జున ఎలికా (గోపాల్), రామకృష్ణ సనపల, అరుణ్ చంద్ర వట్టికూటి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో రమణ్, వర్షా విశ్వనాథ్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దర్శకుడు వశిష్ట హాజరయ్యారు.
ఈ సందర్భంగా వశిష్ట మాట్లాడుతూ.. “మటన్ సూప్ మూవీ టైటిల్ చాలా ఆకట్టుకుంది. ఈ మూవీ ట్రైలర్ కూడా బాగుంది. సినిమా మంచి విజయాన్ని సాధించి టీమ్ అందరికీ మంచి పేరు తేవాలి” అని అభిలాషించారు.
ఈ మూవీ దర్శకుడు రామచంద్ర వట్టికూటి మాట్లాడుతూ.. “మేము ఈ సినిమాను ఎంతో ప్యాషన్‌తో తీశాం. నిర్మాతలు ఇచ్చిన సపోర్ట్ మాకు బలం. అక్టోబర్ 10న థియేటర్లలోకి రానున్న మా సినిమాను అందరూ చూసి ప్రోత్సహించాలి” అన్నారు.
హీరో రమణ్ మాట్లాడుతూ.. “ప్రతి ఒక్కరూ ఈ సినిమాకి ప్రాణం పెట్టి పని చేశారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఫలితంగా మంచి సినిమా వచ్చింది” అని చెప్పారు.
నిర్మాత మల్లిఖార్జున ఎలికా మాట్లాడుతూ.. “మొదట టైటిల్‌పై డౌట్ ఉన్నా, కథ విన్నాక ఇది సరిపోతుందని అర్థమైంది. సెన్సార్‌లోనూ కొన్ని సమస్యలు ఎదురైనా, అన్ని అడ్డంకులు దాటుకుని మా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది” అన్నారు.
ఇక ఈ కార్యక్రమంలో నిర్మాత రామకృష్ణ సనపల, నటులు జెమినీ సురేష్, శ్రీచరణ్, కిరణ్ మేడసాని, గోవింద్, సంగీత దర్శకుడు వెంకీ వీణా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పర్వతనేని రాంబాబు తదితరులు కూడా పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు.