హీరోగా మారుతున్న మరో మ్యూజిక్ డైరెక్టర్

gv-prakash
గత కొంత కాలంగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ హీరోలుగా మారి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటికే విజయ్ అంటోనీ హీరోగా మారాడు. ఇప్పుడు అదే బాటలో ‘డార్లింగ్’ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా తెలుగు వారికి పరిచయమైన జివి ప్రకాష్ కుమార్ త్వరలోనే హీరోగా అరంగేట్రం చేయనున్నాడు. ఇటీవలే జివి ప్రకాష్ కుమార్ ఓ ప్రొడక్షన్ హౌస్ ని మొదలు పెట్టారు, దీని ద్వారా కొన్ని చిన్న బడ్జెట్ చిత్రాలను నిర్మించనున్నాడు. కానీ తను హీరోగా పరిచయమవుతున్న చిత్రం మాత్రం తన సొంత ప్రొడక్షన్ లో చేయడం లేదు.

జివి ప్రకాష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా పేరు ‘పెన్సిల్’. గతంలో గౌతం మీనన్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేసిన మని నాగరాజ్ ఈ మూవీ ద్వారా డైరెక్టర్ గా మారి మెగా ఫోన్ పట్టుకోనున్నాడు. థిల్లర్ లవ్ స్టొరీ గా తెరకెక్కే ఈ సినిమాలో జివి ప్రకాష్ సరసన ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించనుంది. ఈ మూవీలో ఇద్దరూ ఇంటర్మీడియట్ చదివే స్టూడెంట్ పాత్రల్లో కనిపించనున్నారు. తమిళ్ లో తెరకెక్కనున్న ఈ సినిమా నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాని ఇతర భాషల్లో డబ్ చెయ్యడం లాంటి విషయాలపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు.

Exit mobile version