ప్రభాస్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ ?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ‘రాధే శ్యామ్’ . కాగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరనేది షూట్ ప్రారంభించిన రోజు నుంచీ సస్పెన్స్ ఉంది. తాజా అప్ డేట్ ఏమిటంటే, తమిళానికి చెందిన యువ స్వరకర్త జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ కూడా ప్రారంభించాడట. అన్నట్లు విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ కి జస్టిన్‌ ప్రభాకరన్‌ మ్యూజిక్ అందించారు.

కాగా లాక్ డౌన్ కి ముందు జార్జియాలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా కారణంగా కొంత షూట్ మిగిలి ఉండగానే మధ్యలోనే ఇండియాకు తిరిగివచ్చేశారు టీం. అయితే మిగిలిన బ్యాలెన్స్ పార్ట్ షూట్ కోసం మళ్లీ జార్జియా వెళ్లాలంటే కష్టం. అందుకే రామోజీ ఫిల్మ్ సిటీలో జార్జియా నేపథ్యం కనబడేలా భారీ సెట్ వేస్తున్నారట.

‘జిల్’ చిత్రాన్ని తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాని గోపికృష్ణ మూవీస్ , యువీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో టాల్ బ్యూటీ పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తోంది.

Exit mobile version