IPL 2025 : SRHకు మరో ఓటమి.. హోం గ్రౌండ్‌లో ముంబై ఈజీ విన్

IPL 2025 : SRHకు మరో ఓటమి.. హోం గ్రౌండ్‌లో ముంబై ఈజీ విన్

Published on Apr 18, 2025 12:01 AM IST

ఐపీఎల్ 2025లో భాగంగా జరిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ముంబై ఇండియన్స్ జట్లు వాంఖడే స్టేడియంలో తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు వచ్చిన SRH పరుగులు చేసేందుకు తీవ్రంగా కష్టపడ్డారు. స్లో పిచ్, ముంబై బౌలర్లు పద్దతిగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ ఓపెనర్లు పరుగులు చేసేందుకు చాలా కష్టపడ్డారు. ఇక వికెట్లు కూడా తరుచుగా పడుతుండటంతో SRH తక్కువ స్కోర్‌తో ముందుకెళ్లింది. అభిషేక్ శర్మ (40), ట్రావిస్ హెడ్(28), నితీశ్ కుమార్ రెడ్డి (19), క్లాసెన్(37), అనికేత్ వర్మ(18 నాటౌట్) పరుగులు చేయడంతో SRH నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

ఇక 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ(26), రియాన్ రికెల్టన్(31) మంచి ఆరంభాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన విల్ జాక్స్(36), సూర్య కుమార్ యాదవ్(26) పరుగులు చేశారు. ఇక చివర్లో వచ్చిన తిలక్ వర్మ(21 నాటౌట్), హార్ధిక్ పాండ్యా(21) పరుగులతో ముంబై ఇండియన్స్‌కి ఈజీ విక్టరీ అందించారు. 18.1 ఓవర్లలోనే ముంబై ఇండియన్స్ 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించారు.

తాజా వార్తలు