ఐటెం సాంగ్స్ ముందు గుర్తొచ్చే భామ ఎవరు అంటే ముందుగా అంటే ముమైత్ ఖాన్. మహేష్ బాబుతో పోకిరి సినిమాలో ‘ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే’ అంటూ ఆది పాడి అప్పటి వరకు మూసగా ఉన్న ఐటెం సాంగ్స్ కి కొత్త ఊపు తెచ్చింది. ఇప్పుడు ఆమె హవా బాలీవుడ్లో కూడా కొనసాగబోతుంది. ‘ఎనిమీ’ అనే సినిమాలో సినీల్ శెట్టి పక్కన బార్ టేబుల్స్ పై ఆది పాడబోతుంది. ఈ పాటకి బప్పి లహరి సంగీతం అందిస్తుండగా ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ నృత్యాలు సమకూరుస్తున్నారు.
ముమైత్ ఖాన్ గతంలో సంజయ్ దత్ పక్కన ‘మున్న భాయ్ ఎమ్బీబీఎస్’ అనే సినిమాలో ‘సీఖ్ లే’ అనే పాటలో నర్తించింది. ఎనిమీ సినిమాలో మిథున్ చక్రవర్తి, సునీల్ శెట్టి, కెకె, జానీ లీవర్ మరియు మహేష్ మంజ్రేకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అయేషా త్రిఖ దర్శకత్వం వహిస్తున్నారు.