80 మరియు 90 దశాబ్దాలలో తెలుగు చిత్రంలో ఇద్దరు కథానాయికలు తప్పనిసరిగా ఉండాల్సిందే. కాని తరువాత ఒక్కరే కథానాయికతో చిత్రాన్ని నడిపించడం మొదలయ్యింది.కాని ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇద్దరు కథానాయికల చిత్రాలు మళ్ళీ మొదలయినట్టు తెలుస్తుంది.గత ఏడాది వచ్చిన ప్రభాస్ చిత్రం “మిస్టర్ పర్ఫెక్ట్” లో తాప్సీ మరియు కాజల్ కలిసి ఒకే తెర మీద కనిపించారు ప్రస్తుతం రామ్ చరణ్ “నాయక్” చిత్రంలో అమలా పాల్ మరియు కాజల్ అగర్వాల్ కనిపిస్తుండగా అల్లు అర్జున్ రాబోతున్న చిత్రం “ఇద్దరమ్మాయిలతో” కూడా ఇద్దరి కథానాయికలతో ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇలా తెర మీద ఇద్దరు అందాల భామలు కనిపించి అలరించడం ప్రేక్షకులకు వీనులవిందు అవుతుంది.