ఎం.ఎస్ రాజు తన రాబోయే ‘రమ్’ సినిమా షూటింగ్ కోసం సిద్దమవుతున్నారు. ఈ సినిమాకి పూర్తి పేరు రంభ – ఊర్వశి – మేనక. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో భారీగా యాక్షన్ సీక్వెన్స్ లు ఉండనున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో త్రిష, పూర్ణ హీరోయిన్స్ గా ఎంపికవ్వగా మూడవ హీరోయిన్ పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ సినిమాలోని ఊర్వశి పాత్రకి అర్చనని తీసుకుంటున్నారని ఇదివరకే వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం ఊర్వశి పాత్రకి నిఖీషా పటేల్ ని ఎంపిక చేసారు.
పవన్ కళ్యాన్ హీరోగా చేసిన ‘పులి’ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఈ భామ ఆ సినిమా విజయం సాధించకపోవడంతో ఆఫర్లు దక్కించుకోవడంలో వెనుకబడింది. స్వతహాగా లండన్ కి చెందిన ఈ భామ త్వరలోనే కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న ‘ఓం’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న రమ్ సినిమా ‘వాన’, ‘తూనీగా తూనీగా’ తర్వాత ఎం.ఎస్ రాజు డైరెక్ట్ చేస్తున్న మూడవ సినిమా.