IPL హిస్టరీలో ధోని రేర్ రికార్డు!

టోటల్ క్రికెట్ హిస్టరీలో ఐపీఎల్ అనే ఫార్మాట్ ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ ఐపీఎల్ ఇపుడు 18వ సీజన్ ని అంతే సక్సెస్ గా రన్ అవుతుంది. ఇక ఈ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి గాని ఆ జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోనికి ఉన్న క్రేజ్ కూడా అనన్య సామాన్యం.

ఏ టీంతో మ్యాచ్ ఉన్నా కూడా ఆ హోమ్ గ్రౌండ్ లో డామినేషన్ ధోని పేరిటే ఉంటుంది. మరి ఇలా ఐపీఎల్ లో ఎన్నో రికార్డులు సెట్ చేసిన ధోని ఖాతాలో ఇపుడు మరో అరుదైన రికార్డు వచ్చింది. ఇలా ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ నాట్ అవుట్ గా నిలిచిన క్రికెటర్ గా ఆల్రెడీ ధోనికి మంచి రికార్డు ఉంది.

అయితే ఇపుడు ఏకంగా 100 నాట్ అవుట్స్ గా నిలిచిన ఏకైక క్రికెటర్ గా ధోని ఐపీఎల్ లో కొత్త రికార్డు నమోదు చేశారు. అలాగే ఈ నాట్ అవుట్స్ లో ధోని ఛేజింగ్ పరంగా చూసుకున్నా కూడా అత్యధిక విన్నింగ్ పర్సెంట్ ధోని ఖాతాలో ఉంది. ఇలా మొత్తానికి నిన్న కలకత్తాతో జరిగిన మ్యాచ్ తో ధోని తన 100వ నాట్ అవుట్ ని పూర్తి చేసుకొని సరికొత్త రికార్డు సెట్ చేశారు.

Exit mobile version