సునీల్ పూల రంగడు విడుదలై సరిగ్గా సంవత్సరం పూర్తయింది. ఆ తరువాత అతను నటించిన సినిమా ఒక్కటి కూడా విడుదల కాలేదు. సంవత్సరం గ్యాప్ తరువాత వస్తున్న మిస్టర్ పెళ్ళికొడుకు ఫిబ్రవరి 22న విడుదల కావాల్సి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడం వల్ల ఒక వారం ఆలస్యంగా విడుదల కాబోతుంది. మార్చ్ 1న మిస్టర్ పెళ్ళికొడుకుని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ తను వెడ్స్ మను రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో సునీల్ సరసన ఇషా చావ్లా రెండవసారి నటించింది. దేవీప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ కలిసి నిర్మించారు.