దమ్ము కోసం నైజాం ఏరియాలో థియేటర్లు పెంచిన దిల్ రాజు

దమ్ము కోసం నైజాం ఏరియాలో థియేటర్లు పెంచిన దిల్ రాజు

Published on Apr 30, 2012 8:16 AM IST


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దమ్ము’ బానే ఉండటంతో నైజాం ఏరియాలో ఈ చిత్రం కోసం కొన్ని థియేటర్లు పెంచనున్నారు. దమ్ము చిత్రాన్ని నైజాం ఏరియ పంపిణీ హక్కులు దిల్ రాజు కొనుగోలు చేసారు. మొదటి రోజు మిశ్రమ స్పందన లభించినప్పటికీ రోజు రోజుకి కలెక్షన్లు బలంగానే కొనసాగుతున్నాయి. ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్, కీరవాణి నేపథ్య సంగీతం అలాగే ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులును ఆకర్షిస్తున్నాయి. నైజాంతో పాటుగా వైజాగ్ వంటి కొన్ని ఏరియాల్లో కలెక్షన్లు బలంగా ఉన్నాయి. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన త్రిషా, కార్తీక నటించారు. సింహ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎ. వల్లభ నిర్మించిన ఈ చిత్రాన్ని కె.ఎస్ రామారావు సమర్పించారు.

తాజా వార్తలు