‘మోనిక’తో పెప్పీ డ్యాన్స్ నెంబర్ పట్టుకొచ్చిన ‘కూలీ’

‘మోనిక’తో పెప్పీ డ్యాన్స్ నెంబర్ పట్టుకొచ్చిన ‘కూలీ’

Published on Jul 11, 2025 6:23 PM IST

తమిళ స్టార్ హీరో రజినీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ చిత్రం ఇప్పటికే అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు లోకేశ్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

అయితే, ఈ సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ ఇస్తూ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘మోనిక’ అనే సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను పెప్పీ డ్యాన్స్ నెంబర్‌గా అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేశారు. ఈ పాటలో పూజా హెగ్డే అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీసింది.

ఇక ఈ సినిమాలో రజినీకాంత్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుంది. ఇక ఈ సినిమాలో ఉపేంద్ర, నాగార్జున, శ్రుతి హాసన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు