మీరాజాస్మిన్ ప్రదాన పాత్రలో నటించిన సినిమా ‘మోక్ష’. హీరోయిన్ ఓరియంటెడ్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 28న విడుదల సిద్దమయ్యింది. తండ్రి కూతుళ్ళ మద్య ఉండే అనుబందం, ఆప్యాయతల చుట్టూ సాగే సినిమా ఇది. ఈ సినిమాలో మీరాజాస్మిన్ తండ్రిగా నాజర్ నటించాడు. హారర్ థ్రిల్లర్ తో పాటు ఎమోషినల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకి శ్రీకాంత్ వేములపల్లి దర్శకత్వం వహించాడు. అమరనాథన్ మూవీస్ పథకం పై పి. అమరనాథ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి విజయ్ కురాకుల సంగీతాన్ని అందించాడు. ఈ సినిమా రాష్ట్ర వ్యాప్తంగా 250 థియేటర్స్ లో విడుదల కావడానికి సిద్దమవుతోంది.