ఇది నాకు నిజమైన రీ ఎంట్రీ మూవీ – డా. మోహన్ బాబు

mohan-babu-in-ppt
మంచు ఫ్యామిలీ హీరోలంతా కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ ‘పాండవులు పాండవులు తుమ్మెద’. ఈ సినిమా జనవరి 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ లో హిట్ అయిన గోల్ మాల్ 3 రీమేక్ రైట్స్ ని తీసుకున్న ఈ చిత్ర టీం ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ని మాత్రమే ఈ సినిమాలో ఉపయోగించుకున్నారు.

ఈ సినిమా విజయంలో ఎంతో నమ్మకంగా ఉన్న డా. మోహన్ బాబుని ఈ సినిమాలో తన పాత్ర గురించి అడిగితే ‘ఈ మూవీలో టూరిస్ట్ గైడ్ అయిన నాయుడు పాత్రలో కనిపిస్తాను. ఆ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. వినగానే ఎంతో నచ్చింది. ఆ పాత్రకి బాగా కనెక్ట్ అయ్యాను అందుకే ఈ సినిమా చేసాను. అలాగే నేను ఇప్పటి వరకూ చేసిన అన్ని కామెడీ పాత్రలకంటే ఈ పాత్ర ఎక్కువగానే నవ్విస్తుంది. చెప్పాలంటే ఈ మూవీనే అసలైన రీ ఎంట్రీ నాకు. ఈ మూవీలో పంచ్ డైలాగ్స్ అందరినీ నవ్విస్తాయని’ సమాధానం ఇచ్చాడు.

ఈ మూవీలో డా. మోహన్ బాబు తో పాటుగా మంచు విష్ణు, మంచు మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో రవీన టాండన్, హన్సిక, ప్రణిత హీరోయిన్స్ గా నటించారు.

Exit mobile version