ఓటిటి సమీక్ష: మోహన్ లాల్ ‘హృదయ పూర్వం’ – తెలుగు డబ్ చిత్రం జియో హాట్ స్టార్ లో

విడుదల తేదీ : సెప్టెంబర్ 26, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : మోహన్ లాల్, మాళవిక మోహనన్, సంగీత మాధవన్ నైర్, సంగీత్ ప్రతాప్, మీరా జాస్మిన్ (క్యామియో), బాసిల్ జోసెఫ్ (క్యామియో) తదితరులు
దర్శకుడు : సత్యానంద్ అంతికద్
నిర్మాత : ఆంటోనీ పెరంబువూర్
సంగీత దర్శకుడు :  జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రాఫర్ : అను మూతేదత్
ఎడిటర్ : రాజ్ గోపాల్

సంబంధిత లింక్స్ : ట్రైలర్ 

మలయాళ సినిమా సీనియర్ స్టార్ నటుడు మోహన్ లాల్ హీరోగా నటించిన సినిమాలు మూడు ఈ ఒక్క ఏడాదిలోనే రిలీజ్ కి వచ్చాయి. మరి ఈ చిత్రాల్లో లేటెస్ట్ రిలీజ్ ‘హృదయపూర్వం’ కూడా ఒకటి. మరి ఈ సినిమా తెలుగు డబ్బింగ్ లో జియో హాట్ స్టార్ లో లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.

కథ:

ఒక చిన్నపాటి ఫుడ్ బిజినెస్ చేసుకునే సింపుల్ వ్యక్తి అందులోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సందీప్ బాలకృష్ణన్ (మోహన్ లాల్) కి ఆరోగ్యం పాడవడంతో తనకి గుండె మార్చాల్సి వస్తుంది. ఆ గుండె పూణేకి చెందిన ఓ ఆర్మీ కల్నల్ రవీంద్రనాథ్ ది అమరుస్తారు. ఇలా ఆపరేషన్ అయ్యాక సందీప్ కి కేర్ టేకర్ గా జరీ (సంగీత్ ప్రతాప్) ని డాక్టర్లు నియమిస్తారు. అక్కడ నుంచి వీరి జర్నీ ఎలా సాగింది. ఈ టైం లోనే కల్నల్ కూతురు హరిత (మాళవిక మోహనన్) వచ్చి మోహన్ లాల్ ని తన తండ్రి చివరి కోరిక అంటూ తనని పూణే ఆహ్వానిస్తుంది. అక్కడ తన తల్లి దేవిక (సంగీత మాధవన్ నైర్) తో ఆమె కలిసి ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చాక ఎంతో కాలం నుంచి పెల్లు లేకుండా ఉన్న సందీప్ కి కలిగిన ఆశలు ఏంటి? ఎవరితో? చివరికి సందీప్ ఎవరినైనా పెళ్లి చేసుకున్నాడా లేదా? పూణే వెళ్లిన తర్వాత తాను రియలైజ్ అయ్యింది ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి.

ప్లస్ పాయింట్స్:

ఈ చిత్రం కూడా మలయాళ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక సింపుల్ అండ్ డీసెంట్ ఫ్యామిలీ డ్రామా అని చెప్పవచ్చు. ఒక సింపుల్ లైన్ ని దర్శకుడు పెద్దగా ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించారు. ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ తో మొదలైన కథనం కొంచెం తెలిసిన మూమెంట్స్ తరహాలోనే వెళుతుంది కానీ ఎంటర్టైనింగ్ గా అక్కడక్కడా మంచి ఫన్ ని జెనరేట్ చేస్తూ వెళ్ళిపోతుంది.

ఇక నటుడు మోహన్ లాల్ మరోసారి ఒక సూటబుల్ రోల్ లో కనిపించారని చెప్పాలి. చాలా సింపుల్ నటనతో డీసెంట్ మ్యానరిజాలతో మోహన్ లాల్ మంచి పెర్ఫామెన్స్ ని కనబరిచారు. ఇక తనతో పాటుగా నటించిన ప్రేమలు నటుడు సంగీత్ ప్రతాప్ తన మార్క్ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకుంటాడు.

ఇక నటి మాళవిక మోహనన్ మంచి రోల్ లో కనిపించింది అని చెప్పవచ్చు. నాచురల్ లుక్స్ తో మోహన్ లాల్ నడుమ పలు సీన్స్ నీట్ గా అనిపిస్తాయి. ఇక వీరితో పాటుగా మాళవిక తల్లి రోల్ లో నటించిన సంగీత మాధవన్ నైర్ డెఫినెట్ గా వీక్షకుల దృష్టిని ఆకర్షిస్తారు. చాలా యంగ్ లుక్స్, అందంగా కనిపిస్తే అంతే మంచి నటన కూడా ఆమె కనిపించారు.

సెకండాఫ్ లో వీరి ముగ్గురు నడుమ సెపరేట్ చిన్న ట్రాక్స్ మంచి ఫన్నీగా అనిపిస్తాయి. ఇక ఈ ఫన్ సైడ్ పక్కన పెడితే ఆకట్టుకునే ఎమోషన్స్ కూడా ఈ చిత్రంలో కనిపిస్తాయి. రొటీన్ గానే ఉన్నప్పటికీ పర్వాలేదు బాగానే అనిపిస్తాయి. వీటితో పాటుగా మీరా జాస్మిన్, బాసిల్ జోసెఫ్ ల చిన్న క్యామియోలు మంచి సర్ప్రైజ్ అని చెప్పొచ్చు.

మైనస్ పాయింట్స్:

మోహన్ లాల్ నుంచి రెండు మాస్ అండ్ పవర్ఫుల్ సబ్జెక్టులు చూసిన తర్వాత ఇది కంప్లీట్ గా ఒక స్లో కథనం కలిగిన రొటీన్ డ్రామాలా అనిపిస్తుంది. చాలా సింపుల్ మూమెంట్స్ తో ఆల్రెడీ చూసిన కథా, కథనల్లానే ఈ సినిమా కూడా వెళుతుంది. సో మలయాళ సినిమానే కదా కొత్త స్టోరీలు మంచి థ్రిల్లింగ్, ట్విస్ట్ లు లాంటివి ఈ సినిమా నుంచి ఆశించకండి.

అలాగే ప్రేమలు నటుడు సంగీత్ ప్రతాప్ రోల్ ని ఫుల్ ఫ్లెడ్జ్ గా సాగించి ఉంటే బాగుండు అనిపిస్తుంది. తనతో కామెడీ ట్రాక్స్ ఇంకా జోడించి ఉంటే సినిమాలో మరింత ఫన్ జెనరేట్ అయ్యే స్కోప్ ఉంది కానీ దానిని మిస్ చేసుకున్నారు.

అలాగే మోహన్ లాల్, మాళవిక, సంగీత ముగ్గురు నడుమ ట్రాక్ ఒకింత ఫన్ గానే ఉన్నప్పటికీ వీరి నడుమ ట్రాక్ ఇప్పుడు చాలా మందికి కొంచెం ఎబ్బెట్టుగా అనిపించే అవకాశం ఉంది. దానిని చూసే ఆడియెన్ దృష్టి కోణంతోనే డిసైడ్ చేసుకోవాలి. వీటితో పాటుగా పాటలు మరీ అంత ఇంపాక్ట్ ఏమి చూపించలేదు. వాటిని తీసేసి ఉన్నా లేదా చిన్న క్లిప్స్ లానే పెట్టుకున్నా కథనం కొంచెం త్వరగా ముగిసి ఉండేది.

సాంకేతిక వర్గం:

ఈ చిత్రంలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. నేపథ్యానికి తగ్గట్టుగా డిజైన్ చేసుకున్న ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. రాధే శ్యామ్ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ ఇచ్చిన సంగీతం బాగుంది. అను మూతేదత్ ఇచ్చిన కెమెరా వర్క్ బాగుంది. రాజ్ గోపాల్ ఎడిటింగ్ డీసెంట్ గానే ఉంది కానీ అక్కడక్కడా కొన్ని సీన్స్ తగ్గించాల్సింది. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఇక దర్శకుడు సత్యానంద్ అంతికద్ విషయానికి వస్తే.. తన వర్క్ ఈ సినిమాకి బాగానే ఉంది. పెద్దగా బోర్ లేకుండా ఒక రొటీన్ అండ్ రెగ్యులర్ డ్రామాగా దీనిని నడిపించారు. మరీ కొత్తగా ఉందని చెప్పలేం కానీ బాగానే నడిపించేసారు.

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ‘హృదయపూర్వం’ చిత్రం ఒక సింపుల్ గా సాగే నీట్ ఫన్ అండ్ ఎమోషనల్ డ్రామా అని చెప్పొచ్చు. మోహన్ లాల్ ఎప్పటిలానే తన రోల్ లో ఇమిడిపోయారు. నటి సంగీత ఆడియెన్స్ దృష్టిని ఆకర్షిస్తారు. పెద్దగా అంచనాలు లేకుండా ఈ సినిమాని ఓటిటిలో ట్రై చేస్తే అక్కడక్కడా డీసెంట్ మూమెంట్స్ తో ఈ సినిమా మెప్పిస్తుంది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team 

Exit mobile version