ఇంటికి వచ్చిన మోహన్ బాబు మనవరాళ్ళు

ఇంటికి వచ్చిన మోహన్ బాబు మనవరాళ్ళు

Published on Mar 7, 2012 8:27 PM IST


కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు గారు తన మనవరాళ్ళు అయిన అరియన్నా, వివియన్నా లను చూసి ఆయన గర్వంగా ఫీలవుతున్నారు. మంచు విష్ణు మరియు మంచు విన్నీ లకు ఇటీవలే అమెరికాలో కవల పిల్లలు పుట్టిన విషయం మనకు తెలిసిందే. వారు అమెరికా నుండి ఇండియాకు మొదటి సారి తిరిగి వచ్చారు. వారిని చూసి తెగ మురిసిపోయిన మంచు కుటుంబ సభ్యులు తమ అనుభూతిని ట్విట్టర్ ద్వారా తమ సంతోషాన్ని పంచుకున్నారు. మంచు మనోజ్ నటించిన మిస్టర్ నూకయ్య రేపే విడుదలవుతున్న విషయం తెలిసిందే. మిస్టర్ నూకయ్య చిత్రం విజయం సాధించి ఆ కుటుంబానికి మరో ఆనదం రావాలని కోరుకుందాం.

తాజా వార్తలు