పైరసీను పెంచద్దని విజ్ఞప్తి చేసిన కలెక్షన్ కింగ్

mohan-babu
తెలుగు తెరకు దొరికిన విలక్షణ నటులలో మోహన్ బాబు ఒకరు. ఆయన 50 సినిమాలకు నిర్మాతగా దాదాపు 510 సినిమాలలో నటునిగా కళామతల్లికి సేవ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన కొడుకు నిర్మించి నటిస్తున్న ‘దూసుకెళ్తా’ సినిమా విడుదలకోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు.

చాలా రోజుల తరువాత మోహన్ బాబు ట్విట్టర్ లో ప్రేక్షకులను పైరసీని పెంచద్దని థియేటర్ లోనే సినిమాను చూడమని అర్ధించాడు. “మేము మీలాంటి వేల మందికోసం సినిమా తీస్తాం. మీరందరూ కలిసి పైరసీని ఆపితే తప్ప మేము సినిమాలు తీయలేం” అని అన్నారు. పడ్డ కష్టం ఎన్నటికీ వృధా కాదని, విష్ణు సినిమా తప్పక విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసాడు.

Exit mobile version