‘దూసుకెల్తా’ చూసి థ్రిల్ అయిన మోహన్ బాబు

Mohan-Babu
కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు ‘దూసుకెల్తా’ సినిమా చూసి చాలా థ్రిల్ అయ్యారు. ఈ సినిమా విష్ణు మంచు హీరోగా వీరుపొట్ల దర్శకత్వం వహిస్తున్నాడు. మోహన్ బాబు ఈ సినిమా ఫస్ట్ 10నిమిషాల చూసి చాలా సంతోషించారు. దీనిలో విష్ణు ఇంట్రడక్షన్ చాలా బాగుందన్నారని విష్ణు ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది. ‘ప్రతి సారి నాన్న గారు నా సినిమా చూస్తారు. నేను పరీక్ష రాసి రిసల్ట్ కోసం ఎదురు చూసే వాడిగా అయన రిసల్ట్ కోసం ఎదురు చూస్తాను. ఈ రోజు నాన్న గారు నా సినిమా ”దూసుకెల్తా’ మొదటి 10 నిముషాలు చూశారు. అయన నా రూంకి వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చి హాగ్ చేసుకున్నారు. పోసానితో కలిసి నా ఇంట్రడక్షన్ ఆపుకోలేనంతగా నవ్వుని తెచ్చిందని అన్నారు. ఆయన మొదటిసారి ఇలా రియాక్ట్ అయ్యారు. నాకు చాలా రిలీఫ్ అనిపించిందని’ ట్వీట్ చేశాడు.

ఈ సినిమాలో ‘అందాల రాక్షసి ఫ్రేం’ లావణ్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఫ్రెష్ షెడ్యూల్ సోమవారం నుండి మొదలవుతుంది. వివియానా, అరియానా సమర్పణలో 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Exit mobile version