మోహన్ బాబు ఆత్మీయ విన్నపం..!

మోహన్ బాబు ఆత్మీయ విన్నపం..!

Published on Mar 17, 2020 4:57 PM IST


మోహన్ బాబు ఘనంగా జరగాల్సిన తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్నారు. ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయానికి కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అడ్డుకట్ట వేశారు. తిరుపతి వేదికగా ఆయన నెలకొల్పిన శ్రీ విద్యా నికేతన్ వార్షికోత్సవాన్ని ప్రతి ఏడాది మోహన్ బాబు జన్మదినం నాడు ఘనంగా నిర్వహిస్తారు. ఈనెల 19న మోహన్ బాబు పుట్టినరోజు కావడంతో ఈ కార్యక్రమం జరగాల్సివుండగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు.

అలాగే పిల్లలు, తల్లిదండ్రుల ఆరోగ్యం, భద్రత విషయాలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా సంస్థలు. సినిమా థియేటర్స్, పార్క్స్, మాల్స్ వంటి వాటి మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

తాజా వార్తలు