ఆంధ్రప్రదేశ్ ఇంట్లో ఉండి వంట చేసుకునే గృహిణిలందరికీ బ్లాక్ బస్టర్ సీరియల్ ‘మొగలిరేకులు’ ద్వారా సాగర్ సుపరిచితుడే. ఆర్. కె నాయుడు పాత్రలో అద్బుతంగా నటించి తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నాడు
ఇప్పుడు ఆ సీరియల్ పూర్తయింది కనుక ఇతని కళ్ళు బుల్లి తెరపై నుండి వెండి తెర మీదకు మళ్ళాయి. రాజేంద్ర ప్రసాద్, రాశి వంటి పెద్ద నటులతో కలిసి ఒక సినిమాలో ప్రధాన పాత్ర పోషించే అవకాశాన్ని దక్కించుకున్నాడు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమాను తీసిన పి. అరుణ్ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకుడు. మరి సాగర్ వెండితెరపై కూడా రానిస్తాడా అన్నది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్న… అతడు ఈ రంగంలో కూడా రాణించాలని మనస్పూర్తిగా కోరుకుందాం