ఆంధ్రప్రదేశ్ గృహీనులకు సుపరిచితమైన ‘మొగలిరేకులు’ సీరియల్లో నటించిన బుల్లితెర నటుడు సాగర్ త్వరలో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయంకానున్నాడు. ఈ చిత్రంతో మృదుల హీరోయిన్ గా పరిచయంకానుంది. అంతేకాక ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్ మరియు రాశీ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు
గతంలో పలు విజయాలను అందించిన అరుణ్ ప్రసాద్ ఈ సినిమాకు దర్శకుడు. సత్యనారాయణ నిర్మాత. చిన్ని చరణ్ సంగీత దర్శకుడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ నిన్ననే విడుదలైంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది