విమాలా రామన్ “కులు మనాలి” చిత్రీకరణ పూర్తి

విమాలా రామన్ “కులు మనాలి” చిత్రీకరణ పూర్తి

Published on Jan 2, 2012 7:41 PM IST

విమాలా రామన్,శశాంక్, కృష్ణుడు మరియు సమీక్ష ప్రధాన పాత్రలు గా “కులుమనాలి” అనే చిత్రం వస్తుంది. ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తుండగా చంద్రశేఖర్ బొప్పన్న నిర్మాత గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది ప్రస్తుంతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిర్మాత మాట్లాడుతూ ఈ చిత్రం థ్రిల్లింగ్ సస్పెన్స్ ఎంటర్ టైనర్ గా చెప్పారు ఈ చిత్ర ఆడియో ఈ నెల లోనే విడుదల చేస్తారు చిత్రాన్ని ఫిబ్రవరి లో రిలీజ్ చెయ్యటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంతకముందు ఎప్పుడు చూడని ప్రదేశాలలో ఈ చిత్రాన్ని చిత్రీకరించారని నిర్మాత తెలిపారు. శ్రీ వసంత్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా శివ కుమార్ చాయగ్రహకుడిగా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు