మే 12న ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఫస్ట్ లుక్

మే 12న ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఫస్ట్ లుక్

Published on May 10, 2012 6:29 PM IST

మంచు మనోజ్,బాల కృష్ణ లు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్ర ఫస్ట్ లుక్ మే 12న విడుదల చెయ్యనున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తూ లక్ష్మి మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో నిర్మించిన భారీ సెట్ లను కూడా ఆరోజే విడుదల చేస్తున్నట్టు లక్ష్మి తెలిపారు . ఈ మధ్యనే ఈ చిత్ర బృందం కేరళలో కొన్ని సన్నివేశాలు మరియు పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంది చిత్రీకరణ జరుపుకుంది. ఈ చిత్ర ప్రధాన భాగ చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకొని ఈ వేసవిలోనే విడుదలకు సిద్దమయ్యింది. శేకర్ రాజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో దీక్ష సెత్ మరియు సోను సూద్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. బోబో శశి సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు