బాలకృష్ణ, మంచు మనోజ్, దీక్షా సేథ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్ర షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 80% షూటింగ్ పూర్తి చేసుకోగా పతాక సన్నివేశాలు హైదరాబాదులో చిత్రీకరించనున్నారు. శేఖర్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మంచు లక్ష్మి నిర్మాత. ఈ చిత్రంలో వైవిధ్యమైన స్టంట్స్ చూపించేందుకు ఇటీవలే మనోజ్ మరియు మంచు లక్ష్మి బ్యాంకాక్ వెళ్లి ఈ రోజే తిరిగి వచ్చారు. ఈ చిత్ర పతాక సన్నివేశాలు భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు మనోజ్ తన ట్విట్టర్ అకౌంటులో పేర్కొన్నాడు. బాబో శశి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.