మళ్లీ వాయిదా పడిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ ఆడియో

నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ నటించిన ‘ఊ కొడతారా ఉలిక్కి పడతారా’ చిత్ర ఆడియో మే 26న జరగాల్సి ఉండగా వాయిదా పడింది. గతంలో మే 18న చేయనున్నట్లు కూడా ప్రకటించి వాయిదా వేసారు. ఈ విషయాన్ని మనోజ్ స్వయంగా తన ట్విట్టర్ అకౌంటులో తెలిపారు. కొన్ని సాంకేతిక సమస్యల వల్ల ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఆడియోని విడుదల చేయలేకపోతున్నాం అంటూ తెలిపాడు. బోబో శశి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ రాజా దర్శకత్వం వహించారు. దీక్షా సేథ్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మంచు లక్ష్మి నిర్మిస్తున్నారు.

Exit mobile version