26న ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఆడియో

26న ఊ కొడతారా ఉలిక్కి పడతారా ఆడియో

Published on May 23, 2012 9:25 PM IST

“ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్ర ఆడియో విడుదల వేడుక ఈ నెల 26న హైదరాబాద్ శిల్ప కళా వేదికలో జరగనుంది. బోబో శశి ఈ చిత్రానికి సంగీతం అందించగా సలీం -సులేమాన్ నేఫధ్య సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు. మంచు మనోజ్ కుమార్ ఈ చిత్రంలో హీరోగా కనిపించనున్నారు. ఈ చిత్రం కోసమే ప్రత్యేకమయిన భారీ సెట్ ని నిర్మించారు. ఈ చిత్రం జూన్ లో విడుదల కానుంది ఈ చిత్రం లో దీక్ష సెత్ కథానాయికగా కనిపించనుంది. శేఖర్ రాజ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మంచు లక్ష్మిమంచు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు