షూటింగ్ పూర్తిచేసుకున్న తడాఖా

Thadaka

అక్కినేని నాగ చైతన్య, సునీల్ హీరోలుగా తెరకెక్కుతున్న ‘తడాఖా’ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ఇటీవలే ఈ సినిమాలోని ప్రధాన తారాగణం పై హైదరాబాద్లో ఓ పాటని చిత్రీకరించారు. దాంతో చిన్న చిన్న పాచ్ వర్క్ పనులు తప్ప మిగతా సినిమా అంతా పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో నాగ చైతన్యకి జంటగా తమన్నా, సునీల్ కి జంటగా ఆండ్రియా జేరేమియా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా తమిళంలో ఆర్య, మాధవన్, సమీరా రెడ్డి, అమలా పాల్ నటించిన హిట్ సినిమా ‘వేట్టై’ కి రీమేక్. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ ఫేం కిషోర్ కుమార్ (డాలీ) డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి బెల్లంకొండ సురేష్ నిర్మాత. నాగ చైతన్య, సునీల్ అన్నదమ్ములుగా నటిస్తున్న ఈ సినిమాలో సునీల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఈ సంవత్సరం సెకండాఫ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version