స్విస్ నుండి తిరిగి రానున్న తాప్సి

స్విస్ నుండి తిరిగి రానున్న తాప్సి

Published on May 10, 2012 3:35 AM IST

అందాల సుందరి తాప్సీ ప్రస్తుతం స్విట్జెర్లాండ్ లో ఉన్నారు. విక్టరీ వెంకటేష్ “షాడో” చిత్రం కోసం ఈ భామ స్విట్జెర్లాండ్ వెళ్లారు. అక్కడ రెండు పాటల చిత్రీకరణ జరుపుకున్నాక మే 11న ఈ భామ ఇండియా తిరిగి రానున్నారు. ఈ చిత్రం లో శక్తివంతమయిన దాన పాత్రలో వెంకటేష్ విభిన్న వేషధారణలో కనిపించనున్నారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కోన వెంకట్ మరియు గోపి మోహన్ స్క్రిప్ట్ అందించారు. శ్రీకాంత్ మధురిమ తో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు