అత్యంత ఆసక్తికరంగా వేచి చూస్తున్న చిత్రం “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” చిత్రం చిత్రీకరణ దశలోనే దిల్ రాజు కి లాభాలు తెచ్చి పెడుతుంది. ఈ చిత్ర ఓవర్సీస్ హక్కులను 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ ఆరు కోట్లకు కొనుగోలు చేసింది. వెంకటేష్ మరియు మహేష్ బాబు ల చిత్రం కావటం మూలాన ఓవర్సీస్ లో కుటుంబాలను ఈ చిత్రం ఆకట్టుకుంటుందని ఈ ధర పలికింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు అంజలి మరియు సమంత మహేష్ బాబు మరియు వెంకటేష్ ల సరసన నటిస్తున్నారు.. మిక్కి జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు