లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చిన సునీల్

లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చిన సునీల్

Published on Apr 3, 2012 7:42 AM IST

కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ నిజ జీవితంలో కూడా హీరో అనిపించుకుంటున్నాడు. ఏప్రిల్ 2న జరిగిన వాక్ ఎ మైల్ ఈవెంట్లో ఆయన వారికీ లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు. డిసిసిఎ (డెవలప్మెంట్ సెంటర్ ఫర్ చిల్డ్రన్ విత్ ఆటిసం) మరియు ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లో జరిగిన ఈవెంట్లో సునీల్ ముఖ్య అతిదిగా పాల్గొన్నాడు. సునీల్ ఇటీవలే నటించిన పూల రంగడు చిత్రం విజయం సాధించగా, మరో రెండు సినిమాలు చేయడానికి అంగీకరించాడు.

తాజా వార్తలు