అల్లరి నరేష్ మరియు మోనాల్ గజ్జర్ ప్రధాన పాత్రలలో రాబోతున్న చిత్రం “సుడిగాడు”. ఈ చిత్ర ఆడియో జూన్ రెండవ వారంలో విడుదల కానుంది.ఈ మధ్యనే ఈ చిత్రంలో ఐటం పాటను హైదరాబాద్ లో ఒక పబ్ లో చిత్రీకరించారు. ఈ చిత్రీకరణలో అల్లరి నరేష్ మరియు రచన మౌర్య పాల్గొన్నారు.దాదాపుగా ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డి చంద్ర శేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తమిళంలో వచ్చిన “తమిళ్ పడం” చిత్రానికి రీమేక్.శ్రీ వసంత్ సంగీతం అందించిన ఈ చిత్రం జూన్ చివరి వారంలో విడుదల అవుతుంది.