ఈరోజుల్లో దర్శకునితో సుధీర్ బాబు

ఈరోజుల్లో దర్శకునితో సుధీర్ బాబు

Published on May 21, 2012 10:29 PM IST

సుధీర్ బాబు తన మూడవ చిత్రాన్ని ఒప్పుకున్నారు. ఈ ఏడాది “ఎస్ ఎం ఎస్ ” చిత్రంతో తెరకు పరిచయమయిన ఈ నటుడు కాస్త విరామం తీసుకున్నారు వంశీ కృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో “అగ్గి పుల్ల” చిత్రం ఒప్పుకోక ముందు చాలా కథలు విన్నట్టు తెలుస్తుంది ఈ చిత్రం కాకుండా సుధీర్ మారుతీ దర్శకత్వంలో మరో చిత్రాన్ని చేస్తున్నట్టు తెలిపారు. “ఈ రోజుల్లో” చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు ఈ చిత్రానికి “గాలి” అనే పేరుని పరిశీలిస్తున్నారు. ఈ చిత్ర బృందం గురించిన వివరాలు త్వరలో ప్రకటిస్తారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తన శరీర ధారుడ్యాన్ని పెంచుకునేందుకు మరియు ఫైటింగ్ నైపుణ్యం పెంచుకునేందుకు శిక్షణ తీసుకుంటున్నారు. తన రాబోతున్న “అగ్గి పుల్ల” చిత్రం యాక్షన్ చిత్రంగా తెరకేక్కబోతుంది.

తాజా వార్తలు