సిద్ధార్థ్ నటించిన ‘లవ్ ఫెయిల్యూర్’ విడుదలైన వరం రోజులకే సిద్ధార్థ్ మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నాడు. నేషనల్ అవార్డు గ్రహీత వెట్రిమారన్ నిర్మాణంలో గ్రాస్ రూట్ బ్యానర్లో వెట్రిమారన్ అసోసియేట్ దర్శకత్వంలో సిద్ధార్థ్ నటించబోతున్నాడు. ఈ చిత్రానికి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. నేషనల్ హైవే బ్యాక్ డ్రాప్లో తెరకెక్కించనున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. వెట్రిమారన్ ఈ చిత్రానికి స్క్రిప్ట్ అందిస్తుండగా వేల్రాజ్ సినిమాటోగ్రాఫ్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేయనున్నారు.