కృష్ణ వంశం నుండి తెరకు పరిచయం కాబోతున్న మరో హీరో

కృష్ణ వంశం నుండి తెరకు పరిచయం కాబోతున్న మరో హీరో

Published on Apr 4, 2012 10:08 PM IST

మహేష్ బాబు మరియు సుదీర్ బాబు తరువాత సూపర్ స్టార్ కృష్ణ వంశం నుండి మరొకరు తెరకు పరిచయం కాబోతున్నారు. మహేష్ బాబు బావ అయిన శివ తెరకు పరిచయం కాబోతున్నారు. రామ్ గోపాల్ వర్మ సహాయకుడిగా చేసిన వెంకన్న బాబు దర్శకత్వంలో ఒక చిత్రంతో ఈయన తెరకు పరిచయం కాబోతున్నారు. ఈ చిత్రానికి ఇంకా ఎటువంటి పేరు అనుకోలేదు. శివ మల్లికార్జున రావు గారి కొడుకు. ఈ చిత్రంలో శ్రద్ద దాస్ కథానాయికగా నటించబోతున్నారు. ఈ చిత్రానికి సంతకం చేసిన తరువాత ఆనందంతో శ్రద్ద ఇలా అన్నారు. ” “రేయ్” చిత్రంలో పాత్రకు చాలా ఆనందంగా ఉంది నేను నా పాత్రకు న్యాయం చేస్తున్నాను అనిపిస్తుంది. ఈ చిత్రంలో చీరలలో కనిపించడం చాలా ఆనందం కలిగించే విషయం. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో ఒక కథానాయకుడి తో చేస్తున్నా త్వరలో కృష్ణ వంశంలో నూతన కథానాయకుడితో చెయ్యబోతున్నాను. రెండు చిత్రాలలోను మంచి పాత్రలు దక్కాయి” అని శ్రద్దా దాస్ అన్నారు. నంది ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా. అమర్ మొహ్లి ఈ చిత్రానికి సంగీతం అందించబోతున్నారు.

తాజా వార్తలు