వెంకటేష్ రాబోతున్న చిత్రం షాడో ఈ జూన్ లో ముంబై లో చిత్రీకరణ జరుపుకోనుంది. ఈ మధ్యనే ఈ చిత్రం స్విట్జర్ల్యాండ్ లో తాప్సీ మరియు వెంకటేష్ ల మీద రెండు పాటలు చిత్రీకరించారు. ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ ఒకటి నుండి రాజ సుందరం పర్యవేక్షణలో ఒక పాటను చిత్రీకరించనున్నారు. దీని తరువాత చిత్ర బృందం జూన్ 17 నుండి ముంబై లో చిత్రీకరణకు వెళ్తుంది. ఈ చిత్రం లో శ్రీకాంత్ మధురిమ లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్ కొత్తగా కనిపించనున్న ఈ చిత్రం లో ఈయన డాన్ పాత్ర పోషిస్తున్నారు. పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించగా కోన వెంకట్ మరియు గోపి మోహన్ లు కథను అందిస్తున్నారు.